ఖమ్మం దానవాయిగూడెం ప్రభుత్వ పాఠశాల మరమ్మతు పనులకు సంబంధించి రూ.13 లక్షల బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ సి.అయోధ్య తన కుటుంబంతో కలిసి పెట్రోల్ బాటిల్‌తో పాఠశాలకు సోమవారం తాళం వేశారు. ఈ సంఘటనతో ఉపాధ్యాయులు,
విద్యార్థులు పాఠశాల ఆవరణ బయట నిలిచిపోయారు. అనంతరం విద్యార్థులను సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రంలో కూర్చోబెట్టారు.