నేలకొండపల్లి మండలం అనాసాగరం గ్రామ దీపికపై అవినీతి ఆరోపణలు చేస్తూ మంగళవారం గ్రామస్తులు, డ్వాక్రా మహిళా సభ్యులు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. డ్వాక్రా గ్రూపుల్లో అక్రమ వసూళ్లు, పొదుపు, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. గ్రామ దీపికను వెంటనే తొలగించాలని, సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను నిగ్గు తేల్చాలని కోరారు. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.