ఖమ్మం కార్పొరేషన్‌లో పెరిగిపోయిన అవినీతి !

1చూసినవారు
ఖమ్మం కార్పొరేషన్‌లో పెరిగిపోయిన అవినీతి !
3 లక్షల జనాభా కలిగిన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో అవినీతి పెరిగిపోయిందని, IAS అధికారి అభిషేక్ కమిషనర్‌గా ఉన్నప్పటికీ పాలనపై పట్టు సాధించలేకపోతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. రెవిన్యూ, శానిటేషన్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో కొందరు అధికారులు, సిబ్బంది కాంట్రాక్టర్లతో కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారని నగరవాసులు ఆరోపిస్తున్నారు. పాలకవర్గం పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ (KMC)పై కలెక్టర్ దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.