ఖమ్మం జిల్లాలోని గిరి ప్రసాద్ భవన్లో శనివారం సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిసెంబర్లో జరగనున్న ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో 60 డివిజన్లలో సీపీఐ అభ్యర్థులను పోటీకి సిద్ధం చేస్తున్నట్లు నాయకులు తెలిపారు. జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై కూడా చర్చించారు. ఈ సమావేశంలో జాతీయ సమితి సభ్యులు కామ్రేడ్ భాగం హేమంతరావు, రాష్ట్ర కంట్రోల్ కమిటీ చైర్మన్ మహమ్మద్ మౌలానా, జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ దండి సురేష్, కౌన్సిల్ సభ్యులు నానబాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.