రాష్ట్రంలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో
కాంగ్రెస్ అభ్యర్థులకు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఈ రెండు స్థానాల్లో సీపీఐతో పాటు అనుబంధ ప్రజాసంఘాలు కూడా
కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా నిలుస్తాయని వెల్లడించారు. అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ శ్రేణులు కృషి చేస్తాయని, ఎన్నికల్లో
కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి సీపీఐ భాగస్వామిగా ఉంటుందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అభ్యర్థులకు పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు.