మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ జైల్‌భరో

9చూసినవారు
మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ జైల్‌భరో
మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ దేశవ్యాప్తంగా డిసెంబర్ 2, 3, 4 తేదీల్లో జైల్‌భరో కార్యక్రమం చేపట్టనుంది. సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు శనివారం ఖమ్మంలో మాట్లాడుతూ, నిత్యావసర ధరల నియంత్రణలో కేంద్రం విఫలమైందని విమర్శించారు. తెలంగాణలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం హామీలు నెరవేర్చకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రకటించాలని కోరారు.

సంబంధిత పోస్ట్