ఏఐటీయూసీ నాయకుడు కిషోర్‌కు సీపీఐ నాయకుల నివాళి

0చూసినవారు
ఏఐటీయూసీ నాయకుడు కిషోర్‌కు సీపీఐ నాయకుల నివాళి
చింతకాని మండలం మత్కేపల్లి గ్రామానికి చెందిన ఏఐటీయూసీ గ్రామ నాయకుడు బంధం కిషోర్ (52) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మత్కేపల్లి చేరుకుని కిషోర్ మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించిన దండి సురేష్, కార్మిక హక్కుల పోరాటాల్లో కిషోర్ ముందుండేవారని, సామాజిక దృక్పథంతో సేవలందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి, మండల కార్యదర్శి దూసరి గోపాలరావు, గీత కార్మికుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బంధం నాగేశ్వరరావు, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్