సీపీఎం నాయకుడు హత్య.. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఖమ్మం సీపీ

3చూసినవారు
సీపీఎం నాయకుడు హత్య.. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఖమ్మం సీపీ
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో సీపీఎం నాయకుడు, మాజీ సర్పంచ్ సామినేని రామారావు (75)ను గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం ఉదయం హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీపీ సునీల్ దత్, వైరా ఏసీపీ, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సహాయంతో విచారణ చేస్తున్నారు. గ్రామ ప్రజలు హత్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసులు నిందితులను గుర్తించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.