నిబంధనలు అతిక్రమిస్తున్న సంస్థలపై క్రిమినల్ కేసులు పెట్టాలి

0చూసినవారు
నిబంధనలు అతిక్రమిస్తున్న సంస్థలపై క్రిమినల్ కేసులు పెట్టాలి
మెడికల్ అకాడమీలు, కోచింగ్ సెంటర్ల పేర్లతో రెగ్యులర్ ఇంటర్ అడ్మిషన్లు చేస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తుడుం ప్రవీణ్ అన్నారు. గుర్తింపు లేకపోయినా రెగ్యులర్ ఇంటర్ అడ్మిషన్లు చేస్తూ విద్యార్థులను, తల్లిదండ్రులను మోసం చేస్తూ లక్షలు దండుకుంటున్నారని శుక్రవారం ఖమ్మంలో నిర్వహించిన సమావేశంలో చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తున్న సంస్థలపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్