ఖమ్మం నగరంలోని ఖానాపురం హవేలీ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన హత్యాయత్నం కేసులో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కేలోతు రమేష్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. రూ.35 లక్షలు, బంగారు ఆభరణాలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా బాధితులపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సోదరి బానోత్ పద్మకు బలవంతంగా పురుగుల మందు తాగించి, ఆమె కుమార్తె వాణిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు.