తిరుమలాయపాలెం మండలంలోని కాకరవాయి గ్రామంలో తల్లి హత్య దారుణంగా జరిగింది. మద్యానికి బానిసైన మధు తన తల్లి మందుల బూబ (50)ను గొడ్డలితో దాడి చేసి హతమార్చాడు. భార్య విడిచి వెళ్లిన తర్వాత తరచూ తల్లితో గొడవపడుతూ ఉండేవాడు. ఆదివారం రాత్రి ఘర్షణలో కోపంతో ఆమె తలపై కొట్టి చంపాడు. బూబ అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించి, మధును అదుపులోకి తీసుకున్నారు