ఖమ్మం జిల్లా బోనకల్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా జర్నలిస్ట్ డేగల వేలాద్రిని తిరిగి రెండవ సారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన ప్రజా సమస్యలను నిరంతరం వెలికితీస్తూ, ప్రభుత్వానికి అధికారులకు ప్రజా సమస్యల పరిష్కార దిశగా వారధిగా నిలుస్తున్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన మాగి ముఖేష్ మాట్లాడుతూ"మండలంలో పనిచేస్తున్న విలేకరుల ఐక్యతకు, క్లబ్ బలోపేతానికి, సంస్థ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తామని తెలిపారు,