పాపటపల్లిలో దట్టమైన పొగమంచు: కనుచూపుమేరలోనూ కనిపించని దృశ్యాలు

5చూసినవారు
శుక్రవారం ఉదయం పాపటపల్లి గ్రామంలో దట్టమైన పొగమంచు ఆవరించింది. వేకువజామున ప్రారంభమైన ఈ మంచు ఉదయం 9 గంటల వరకు తగ్గలేదు. రైతు వేదిక, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల మధ్యలోనూ మంచు కమ్మేసింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేక ఇబ్బందులు పడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు, పశువుల పాలు పిండడానికి వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పక్క ఇళ్లు కూడా కనిపించనంత దట్టంగా మంచు కురిసింది. ఈ చలికాలంలో ఇదే తొలిసారిగా ఇంత భారీగా పొగమంచు కురిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్