పదో తరగతి పరీక్షల నిర్లక్ష్యం: ముగ్గురు అధికారులపై డీఈవో వేటు

పదో తరగతి పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు అధికారులపై డీఈవో చర్యలు తీసుకున్నారు. శనివారం వేంసూర్ మండలం అడసర్లపాడు పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఈవో, విధుల్లో అలసత్వం ప్రదర్శించిన చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్, ఇన్విజిలేటర్‌ను తక్షణమే విధుల నుంచి తొలగించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
