ముదిగొండలో సామాన్యుడిలా "టి" తాగిన డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క
ముదిగొండలో టీ స్టాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బల్లపై కూర్చొని సామాన్యుడిలా "టీ" తాగారు. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. నిరుపేద మహిళ యశోదకు ఇందిరమ్మ ఇళ్ళు, చెప్పులు కుట్టుకునే నాగభూషణం కుమారుడికి రూ. లక్ష రుణం మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.