ఖమ్మం 46వ డివిజన్‌లో సీసీ రోడ్డు, డ్రైన్ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. డివిజన్ కాంగ్రెస్ ఇంచార్జీ బాణాల లక్ష్మణ్ ఈ పనులను పరిశీలించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా త్వరగా పూర్తి చేయాలని సూచించారు. డివిజన్ అభివృద్ధికి నిధులు సమకూర్చిన జిల్లా నాయకులు తుమ్మల యుగంధర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.