ఖమ్మం నగరంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం తెల్లవారుజాము నుండే పలు శివాలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు శివయ్యకు అభిషేకాలు, దీపారాధన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. శివ నామ స్మరణతో ఆలయాలు మారుమోగాయి. దర్శనానంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ నిర్వాహకులు, అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.