శ్రీస్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి గుట్టలో భక్తుల కిటకిట

2చూసినవారు
నూతన సంవత్సరం సందర్భంగా ఖమ్మం నగరంలోని శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి గుట్ట గురువారం భక్తులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి. రద్దీ కారణంగా స్వామివారి దర్శనానికి గంట సమయం పట్టింది. అర్చకులు పూజలు నిర్వహించి భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్