రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. జిల్లాలోని 748 రేషన్ దుకాణాల పరిధిలో 4,69,865 కార్డుదారులకు, 13,28,400 మంది లబ్ధిదారులకు ఈ బియ్యం అందజేయనున్నారు. ఒక్కొక్కరికి నెలకు ఆరు కేజీల చొప్పున, మూడు నెలలకు గాను 2,54,71,860 కేజీల బియ్యం అవసరమని అధికారులు తెలిపారు.