ఖమ్మం నగరం 15వ డివిజన్ పుట్టకోట గ్రామంలోని ఆర్‌సీఎం చర్చిలో ఆదివారం రాత్రి ప్రత్యేక దివ్య బలి పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఫాదర్ జేసురాజ్, ఫాదర్ కృపాకర్ దివ్య పూజ నిర్వహించారు. సిలువపై ఏసుక్రీస్తు ప్రతిమకు పుష్పమాలతో అలంకరించి, కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు. విశ్వాసులు కుటుంబ సమేతంగా హాజరై, ప్రేమ, శాంతి, సహోదర భావంతో మెలగాలని, క్రీస్తు బోధనలను ఆచరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం అనంతరం అందరికీ ఆశీర్వాదాలు అందించారు.