దీపావళి భద్రతపై అవగాహన కార్యక్రమం

16చూసినవారు
దీపావళి భద్రతపై అవగాహన కార్యక్రమం
ఖమ్మంలోని త్రివేణి పాఠశాలలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో దీపావళి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫైర్ స్టేషన్ లీడింగ్ ఫైర్ ఫైటర్ పి. కిరణ్ కుమార్ విద్యార్థులకు బాణసంచా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. పెద్దల పర్యవేక్షణలోనే టపాసులు కాల్చాలని, చేతిలో పట్టుకుని కాల్చరాదని, తగిన దూరం పాటించాలని సూచించారు. ప్రమాదాలు జరిగితే వెంటనే స్పందించేలా నీటిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పాఠశాల డైరెక్టర్ డా. గొల్లపూడి వీరేంద్ర చౌదరి, ప్రిన్సిపాల్ రాజేంద్ర ప్రసాద్ విద్యార్థులకు భద్రతా సూచనలు అందించారు. కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది, వైస్ ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్