మహిళా సంఘాల ఆధ్వర్యంలో డీమార్ట్ తరహా సూపర్ బజార్లు: తెలంగాణ ప్రభుత్వం

2చూసినవారు
మహిళా సంఘాల ఆధ్వర్యంలో డీమార్ట్ తరహా సూపర్ బజార్లు: తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు చేయూతనిస్తూ, వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అనేక కొత్త కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా, డీమార్ట్ తరహాలో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో సూపర్ బజార్లను ఏర్పాటు చేయనుంది. తొలి విడతలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున వీటిని నెలకొల్పనున్నారు. ఖమ్మం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి, ఆ తర్వాత మిగతా జిల్లాల్లో విస్తరించనున్నారు. నిత్యావసర సరుకులు, గృహోపకరణాలు తక్కువ ధరకే లభించేలా ఈ సూపర్ బజార్లను తీర్చిదిద్దనున్నారు. సమర్థవంతంగా పనిచేస్తున్న మహిళా సంఘాలను ఎంపిక చేసి, ప్రభుత్వం స్థలాలను కేటాయించనుంది. వ్యాపారం ప్రారంభించాలనుకునే మహిళలకు వడ్డీ లేని రుణాలు కూడా అందిస్తోంది.