ఖమ్మం ఆసుపత్రుల్లో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీలు

1091చూసినవారు
ఖమ్మం ఆసుపత్రుల్లో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీలు
ఖమ్మం పట్టణంలోని శ్రీమంతా హాస్పిటల్, సాయి మారుతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ డి. రామారావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవలు, సిబ్బంది హాజరు, రోగులకు అందుతున్న చికిత్స, ఆసుపత్రి నిర్వహణ, రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. Clinical Establishments Act, 2010 నిబంధనల ప్రకారం అనుమతులు, రికార్డులు, వైద్యులు, సిబ్బంది అర్హత ధ్రువపత్రాలు అందుబాటులో ఉంచాలని, పరిశుభ్రత, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, రోగుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్