వైద్యుడు జగదీష్ మృతి తీరని లోటు..సీపీఐ

1170చూసినవారు
వైద్యుడు జగదీష్ మృతి తీరని లోటు..సీపీఐ
ఖమ్మం జిల్లాలో ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ జగదీష్ మృతి పట్ల సీపీఐ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. సీపీఐ జాతీయ సమితి సభ్యుడు కామ్రేడ్ భాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేష్, సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ వద్ద డాక్టర్ జగదీష్ మృతదేహానికి ఆదివారం నివాళులర్పించారు. పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించిన జగదీష్ మృతి వైద్య రంగానికి తీరని లోటని వారు పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీపీఐ నాయకులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సంబంధిత పోస్ట్