ఖమ్మంలోని త్రివేణి పాఠశాలలో డాక్టర్స్ డే సందర్భంగా బుధవారం వైద్యుల సేవలను స్మరించుకుంటూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. భారతరత్న డాక్టర్ బిదన్ చంద్ర రాయ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథి డాక్టర్ పేర్ల హర్ష తేజ విద్యార్థులకు ఆరోగ్యకర జీవనశైలి, సమతుల్య ఆహారం, వ్యాయామం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. విద్యార్థుల ప్రసంగాలు, డాక్టర్ వేషధారణలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖ వైద్యులను త్రివేణి యాజమాన్యం సన్మానించి శుభాకాంక్షలు తెలిపింది.