ఖమ్మంలోని స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం డాక్టర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు వైద్యుల వేషధారణలో స్కిట్లు ప్రదర్శించి వైద్య వృత్తి గొప్పతనాన్ని చాటి చెప్పారు. పాఠశాల కరెస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ వైద్యుడు ప్రతి ప్రాణాన్ని కాపాడే ప్రత్యక్ష దైవమని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు వైద్యుల సేవల ప్రాముఖ్యతను వివరించి ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. అనంతరం పలువురు డాక్టర్లను మెమెంటోలతో ఘనంగా సత్కరించారు.