ఖమ్మం - హైదరాబాద్365 హైవేలో సూర్యాపేట మండలం పిల్లలమర్రి సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదంలో ఖమ్మం వైద్యుడు సజీవ దహనం అయ్యారు. పిల్లల మర్రి సమీపంలో ప్రమాదవశాత్తు డివైడర్ ను ఢీకొట్టిన వోల్వో కారులో మంటలు చెలరేగి సజీవ దహనం అయ్యారు. మృతుడు మమత హాస్పిటల్ న్యూరో సర్జన్ డాక్టర్ కాసకుర్తి జగదీష్ గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.