ఖమ్మం, 41వ డివిజన్ చెరువు బజార్‌లో శ్రీ దుర్గా భవాని శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఖమ్మం నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, స్థానిక కార్పొరేటర్, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మక్బుల్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యక్తిగత సహాయకుడు కిరణ్ పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.