ఖమ్మం 20వ డివిజన్‌లో నగర మేయర్ పునుకొల్లు నీరజ నూతన కేఎంసీ ఈస్ట్ జోనల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యాలయం ద్వారా పౌరులకు మున్సిపల్ సేవలు వేగంగా, సమర్థవంతంగా అందుతాయని, శుభ్రత, మౌలిక సదుపాయాలు, ప్రజా సేవల వినతుల పరిశీలన జోన్ స్థాయిలోనే త్వరగా జరుగుతుందని తెలిపారు. ఖమ్మం నగరంలో పౌర సేవల మెరుగుదలకు ఇది కీలక ముందడుగు అని మేయర్ పేర్కొన్నారు.