ప్రమాదకరంగా ఎదులాపురం- ముత్తగూడెం ప్రధాన రహదారి

1192చూసినవారు
ప్రమాదకరంగా ఎదులాపురం- ముత్తగూడెం ప్రధాన రహదారి
ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం-ముత్తగూడెం రహదారిపై భారీ గుంతలు ఏర్పడటంతో రాత్రి వేళల్లో ప్రయాణం తీవ్ర ఇబ్బందికరంగా మారిందని స్థానికులు తెలిపారు. ఆదివారం స్థానిక కాంగ్రెస్ నాయకులు ఈ గుంతలను పరిశీలించి, ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లి మరమ్మత్తులు చేయిస్తామని హామీ ఇచ్చారు.