జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుండగా, మధిర పట్టణంలో మాత్రం వింత పరిస్థితి నెలకొంది. వైరా, సత్తుపల్లి పట్టణాల్లో అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటే, మధిరలోని 22 వార్డుల్లో కేవలం 1, 2 వార్డుల్లో మినహా మిగిలిన 20 వార్డుల్లో ప్రచారం ఇంకా ఊపందుకోలేదు. అభ్యర్థుల సందడి ఎక్కడా కనిపించకపోవడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల హడావుడి లేకపోవడం స్థానికులను ఆశ్చర్యపరుస్తోంది.