ఖమ్మం జిల్లా, వైరా పట్టణంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం అందరి బాధ్యత అని పట్టణ చైర్మన్ కాపా చంద్రకళ మురళీకృష్ణ అన్నారు. పట్టణంలోని బ్రాహ్మణపల్లి గండగల పాడులో బుధవారం ఒక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డస్ట్ బిన్ లను హెల్త్ సబ్ సెంటర్లకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ నేతలు పాల్గొన్నారు.