ఎర్రుపాలెం: దారుణం... పాఠశాలలో కుల వివక్ష!

1023చూసినవారు
ఎర్రుపాలెం మండలం జమలాపురం జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో ప్రశ్నించిన ఎస్సీ విద్యార్థులను వంట మనిషి కుల వివక్షతో అవమానించిన ఘటన వెలుగులోకి వచ్చింది. 'మీరు ఎస్సీలే కదా, పురుగుల అన్నం తినలేరా?' అని హీనంగా మాట్లాడినట్లు విద్యార్థులు తెలిపారు. తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి సిబ్బందిని నిలదీశారు. ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్