తెలుగు రాష్ట్రాల్లో ఎండ, వానల కలయిక: రైతులు ఆందోళన

7చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో ఎండ, వానల కలయిక: రైతులు ఆందోళన
ఏపీ, తెలంగాణలో భిన్నమైన వాతావరణం నెలకొంది. కొన్ని జిల్లాల్లో ఎండలు దంచికొడుతుండగా, మరికొన్ని జిల్లాల్లో వానలు పడుతున్నాయి. రాబోయే కొద్ది రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి నెలకొనే అవకాశముంది. ఏపీలోని కడప, చిత్తూరు, అన్నమయ్య, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, మార్కాపురం, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. సాయంత్రం వరకు ఎండ తీవ్రత ఉంటుందని, ఆ తర్వాత వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. అయితే అకాల వర్షాలతో రైతులు తీవ్ర నష్టపోతున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు బయటకు రావొద్దని వాతావరణశాఖ హెచ్చరించింది. మరోవైపు, ఆలస్యంగా తెలంగాణను తాకనున్న నైరుతి రుతుపవనాలు జూన్ 5 తర్వాత రాష్ట్రాన్ని తాకుతాయని, ఎల్‌నీనో ప్రభావం వల్ల వేగం తగ్గిందని తెలిపింది. రాబోయే మూడ్రోజుల పాటు ఎండ, వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్