రైతు పంటలు ఎండుతున్నాయ్.. కరెంటు కోసం బీజేపీ ఆందోళన

9చూసినవారు
రైతు పంటలు ఎండుతున్నాయ్.. కరెంటు కోసం బీజేపీ ఆందోళన
నేలకొండపల్లి మండలం కొత్త కొత్తూరులో విద్యుత్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్ మాట్లాడుతూ అరకొర వర్షాలతో నాట్లు వేసుకున్న రైతులకు కరెంటు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 24 గంటల ఉచిత విద్యుత్ హామీ అమలు కావడం లేదని విమర్శించారు. సీఎం డౌన్ డౌన్’, కరెంటు కోతలు ఆపాలి’ అంటూ నినాదాలు చేశారు. వ్యవసాయానికి నిరంతరాయ విద్యుత్, ఎండిపోతున్న పంటలకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఏఈ గుద్దేటి రవికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్