ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

19చూసినవారు
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
పెనుబల్లి మండల పరిధిలోని లంకపల్లి గ్రామంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చెండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామానికి చెందిన గుర్రం వెంకట దాసు, అతని భార్య సంపూర్ణ(45) శనివారం ఉదయం రావికంపాడు నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో వియంబంజర మీదుగా ఆంధ్రాలోని జిలుగుమిల్లి వెళుతుండగా పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామం వద్ద వెనుక నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సంపూర్ణ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you