ఖమ్మం జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కామంచికల్లు నుండి కొనిజర్ల మండలంలోని రైతుల పొలాలకు వ్యవసాయ పనులు నిమిత్తం వెళ్లి తిరిగి వస్తున్న రైతులు ఈ ప్రమాదానికి గురయ్యారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొంతమంది గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.