జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ అమలు చేయాలి: TWJF

1085చూసినవారు
జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ అమలు చేయాలి: TWJF
ఖమ్మం జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు పాఠశాలలు, కళాశాలలు, ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రభుత్వం కల్పించిన 50 శాతం ఫీజు రాయితీని తక్షణమే అమలు చేయాలని TWJF (H-2843) అధ్యక్ష, కార్యదర్శులు నానబాల రామకృష్ణ, అర్వపల్లి నగేష్  బుధవారం డిమాండ్ చేశారు. జీవోలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడం దారుణమని, కొన్ని విద్యాసంస్థలు అక్రిడిటేషన్ కార్డులు, జీవో కాపీలు చూపించినా పూర్తి ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి, నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్