ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 51 డివిజన్ లోని ఆర్ఆర్ పబ్లిక్ స్కూల్ లైన్ లోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికుల కథనం ప్రకారం, ఉదయం పెద్ద శబ్దం వినిపించడంతో బయటకు వచ్చి చూడగా ఇంట్లో మంటలు కనిపించాయి. ఈ ఇంట్లో నివసిస్తున్న ఇద్దరు దంపతులు, నారాయణరావు, రమా, ఖమ్మంలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. నారాయణరావుకు స్వల్ప గాయాలు కాగా, రమా కాలు భాగంలో కాలినట్లు సమాచారం. వారిద్దరిని వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండగా, ఫైర్ అధికారులు షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇంట్లో గ్యాస్ సిలిండర్లు సురక్షితంగానే ఉన్నాయని తెలిపారు.