
‘దేవుడి చర్య’ వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన NHAI.. బాధితుడికి పరిహారం
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో కొండచరియలు విరిగిపడటంతో నరేంద్ర సింగ్ రాథోడ్‌కు చెందిన 440 యాపిల్ చెట్లు నేలకూలాయి. ఈ ఘటనపై అతడు ఎన్జీటీని ఆశ్రయించగా, ఎన్హెచ్ఏఐ, దాని గుత్తేదారు భారీ నిర్మాణ పనులు చేపట్టడం వల్లే కొండచరియలు విరిగిపడ్డాయని పిటిషన్లో పేర్కొన్నారు. మొదట దీనిని ‘దేవుడి చర్య’గా పేర్కొని, పరిహారం చెల్లించలేమని తెలిపిన ఎన్హెచ్ఏఐ, తాజాగా వెనక్కి తగ్గి బాధితుడికి రూ.1.80 కోట్లు పరిహారం చెల్లించడానికి అంగీకరించింది.




