చెకుముకి సైన్స్ సంబరాల పోస్టర్ ఆవిష్కరణ

0చూసినవారు
చెకుముకి సైన్స్ సంబరాల పోస్టర్ ఆవిష్కరణ
ఖమ్మంలో ఈ నెల 12 నుంచి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న చెకుముకి సైన్స్ సంబరాల పోస్టర్‌ను అదనపు కలెక్టర్ శ్రీజ బుధవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు చెకుముకి టాలెంట్ పరీక్షలు దోహదపడతాయని అన్నారు. కార్యక్రమంలో జేవీవీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ రమేష్, ప్రధాన కార్యదర్శి అలవాల నాగేందర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు శివనారాయణ, తాతా రాఘవయ్య, బంధం బాబురావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్