ఖమ్మం ఆర్టీవో కార్యాలయంలో వెలుగుచూసిన నకిలీ ఆధార్ కార్డుల వ్యవహారంపై విచారణ చేపట్టినట్లు ఆర్టీవో ధర్మపురి జగదీష్ వెల్లడించారు. ఇప్పటికే బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఏళ్లతరబడి పాతుకుపోయిన కొందరు సిబ్బంది అండదండలతోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి కార్యాలయాన్ని ప్రక్షాళన చేసి, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు డిమాండ్ చేస్తున్నారు.