ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితమైన ప్రయాణం సాగించాలి

6చూసినవారు
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితమైన ప్రయాణం సాగించాలి
ఖమ్మం ఎన్టీఆర్ సర్కిల్ లో సోమవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మూడో విడత 'అరైవ్ అలైవ్' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వంటి కారణాలతో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనివల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని, వారి కుటుంబాలు తీవ్ర దుఃఖంలో మునిగిపోతున్నాయని తెలిపారు. అందరూ బాధ్యతాయుతంగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితమైన ప్రయాణం చేయాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you