ఖమ్మం నగరంలోని 7వ డివిజన్ టేకులపల్లి శ్రీలక్ష్మీనగర్ కాలనీ రోడ్ నంబర్-2లో 8వ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ రెబల్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అన్న వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. కమిటీ సభ్యులు బుర్రా వీరబాబు, భాషబోయిన ఉపేందర్, హరి, వెంకట్, చారి, లక్ష్మణ్, నాగేశ్వరరావు తదితరులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పర్యవేక్షించారు. భక్తుల సహకారంతో అన్న వితరణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.