మాజీ డీసీసీబీ డైరెక్టర్ కిలారు రామారావు కన్నుమూత

1368చూసినవారు
మాజీ డీసీసీబీ డైరెక్టర్ కిలారు రామారావు కన్నుమూత
ఖమ్మం జిల్లా, వి. వెంకటాయపాలెం గ్రామానికి చెందిన ప్రముఖుడు, మాజీ డీసీసీబీ డైరెక్టర్, మాజీ ఉపసర్పంచ్, యంగ్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు కిలారు రామారావు ఆదివారం కన్నుమూశారు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రామారావు గ్రామ ప్రజలతో సన్నిహితంగా ఉంటూ, సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన యువతను ప్రోత్సహించేవారు.

సంబంధిత పోస్ట్