పల్లా జాన్ రాములు 88వ జయంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం

1చూసినవారు
పల్లా జాన్ రాములు 88వ జయంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం
పేదల పక్షపాతి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన పల్లా జాన్ రాములు 88వ జయంతి సందర్భంగా కుమారుడు కిరణ్ ఆధ్వర్యంలో ఖమ్మం మిషన్ ఆసుపత్రి ప్రాంగణంలో ఉచిత జనరల్, కంటి వైద్య శిబిరం నిర్వహించారు. డోర్నకల్ బిషప్ డా. కె. సేనం రాజు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో 1, 000 మందికి పైగా వైద్య పరీక్షలు చేయించుకోగా 300 మందికి ఉచిత కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పల్లా కిరణ్ గత 20 ఏళ్లుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పలువురు ప్రముఖులు, వైద్యులు, పల్లా కిరణ్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్