భగత్ సింగ్ జయంతి సందర్భంగా పండ్ల పంపిణీ

3చూసినవారు
భగత్ సింగ్ జయంతి సందర్భంగా పండ్ల పంపిణీ
భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా ఏఐవైఎఫ్ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో అన్నం సేవా ఫౌండేషన్‌లో అభాగ్యులకు, అనాథలకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం యూనివర్సిటీ పీజీ కళాశాలలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మామిండ్ల శ్రీనాథ్ రెడ్డి, చింతల రమేష్ మాట్లాడుతూ భగత్ సింగ్ స్ఫూర్తితో యువత అవినీతి, అక్రమాలు, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర కోసం చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

సంబంధిత పోస్ట్