ఖమ్మం నగరంలోని సమర్ధనం దివ్యాంగుల సంస్థ ఉచిత స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రంలో శుక్రవారం మహాత్మా గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజర్ మరియు ట్రైనర్ కల్లేపు అఖిల గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ, మహాత్మా గాంధీ స్వతంత్ర పోరాటాన్ని అహింసా మార్గంలో ముందుకు తీసుకెళ్లి విజయం సాధించారని, నేటి యువత ఆయన స్ఫూర్తిని కలిగి ఉండాలని అన్నారు. మాదక ద్రవ్యాల ప్రభావంతో హింస మార్గాన్ని ఎంచుకుంటున్న యువత, మహనీయుల బాటలో నడుస్తూ గొప్పగా జీవించాలని ఆమె సూచించారు.