ఖమ్మంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

3చూసినవారు
ఖమ్మంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఖమ్మంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు, పెనుబల్లి మండల ఇంచార్జి శీలం బ్రహ్మారెడ్డి గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సత్యం, అహింస, శాంతి, సమానత్వం కోసం గాంధీజీ చేసిన కృషిని స్మరించుకున్నారు. ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్