ఖమ్మం జిల్లా బోనకల్ మండలం పరిధిలో నారాయణ పురం గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఆవరణ లో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద పూలమాలవేసి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ కే శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి రమేష్ గాంధీ చూపించిన సత్యం, హింస మార్గాలు ఆదర్శం అని వాటి ప్రకారం నడవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.